నీకే మనసిచ్చాను: తొలి చూపే ఏదో చిత్రం చేసిందా

Posted by admin on 12th November 2010 in తొలి చూపు
Audio Song:
 
Movie Name  
   Neeke Manasichanu
Song Singers
   Rajesh
Music Director
   Sri
Year Released
   2003
Actors
   Srikanth,
   Charmee,
   Anitha
Director
   Surya Teja
Producer
   M.S. Kumar
   Koduri Ramamoorthy

Context

Song Context: 
   తొలి చూపు!

Song Lyrics

||ప|| |అతడు|
       తొలి చూపే ఏదో చిత్రం చేసిందా
       చిరునవ్వే ఏదో మంత్రం వేసిందా
       చిటికెల్లో మతి పోగొట్టే కవ్వింత
       ఎటు రమ్మంటుందో నన్ను తన వెంట
       ఏం మాయో ఏం మాయో ఏం మాయో ఓహోహో
                                ||తొలి చూపే||
.
చరణం:
       మనసే నా మాట వినదే ఈ పూట
       తన దారేదో తనదంటుంది
       తనకే ఈ బాట సరిగా తెలియదట
       అయినా పోదామంటుంది
       అలవాటే లేనంత తడబాటే పడుతున్నా
       పరవాలేదంటుంది..పొరపాటే కాదంటుంది
       ఏం మాయో ఏం మాయో ఏం మాయో ఓహోహో
                                ||తొలి చూపే||
.
చరణం:
       సొగసే పిలిచాక..వయసే పలికాక
       మన చేతుల్లో ఏముంది
       సరదా కలిగాక సరేలే అనుకోక
       వలదని ఆపే వీలేది
       ఏమైందో ఈ వేళ ప్రేమా నీ దయ వల్ల
       పడిపోయా నిలువెల్లా..చెడిపోయా నేనూ అందర్లా
       ఏం మాయో ఏం మాయో ఏం మాయో ఓహోహో
                                ||తొలి చూపే||
.
.
             (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)