|
Context
Song Context:
మాఘ మాసం మంచి ముహూర్తం కుదిరిందే ఎంచక్కా! |
Song Lyrics
||ప|| |అతడు|
మాఘ మాసం మంచి ముహూర్తం కుదిరిందే ఎంచక్కా
ఆమె:
పుష్య మాసం పూర్తి కాందే ముదిరిందే నీ తిక్కా
అతడు:
మరి తప్పలేదు గనుకా
నువ్వు తప్పుకోకే చిలకా
ఆమె:
అరె కొత్త నిప్పు గనుక
గుప్పు గుప్పుమనక అప్పుడే ఎలాగ
అతడు:
పొంగుతున్న కోరిక లొంగనంది ఇంకా
ఆమె:
కొంగు చిర్రులెత్తకా జంకు గొంకు లేక
దొంగ ముద్దు కోసం ఎగబడిపోక
||మాఘ మాసం||
.
చరణం: అతడు:
ఇంత వరకైనా బుద్ధిగానే లేనా
పద్ధతులు వదిలానా నిజంగా పెద్దమనిషిని కానా
ఆమె:
ఎంత వరకైనా హద్దు వీడి రానా
నింద పడిపోవలెనా చటుక్కున సిద్ధపడి రావలెనా
అతడు:
విస్తరేసి ఇంకా పస్తు పెడతావా
దేనికింకా ఆలస్యం
ఆమె:
పుస్తె ముడి దాకా నిష్ఠ చెడనీక
ఆపలేవా ఆవేశం
అతడు:
కించిత్తు సరదా కావాలన్నా
అటు ఇటు చూడాలా ఇదేదో చెయ్యరాని నేరంలా
ఆమె:
చాటు మాటు బేరాలా
ఇవాళే సిగ్గు వదిలేయాలా
||మాఘ మాసం||
.
చరణం: ఆమె:
లగ్గమవగానే లక్షణంగా అన్నీ
కట్టి పెట్టుకుంటావా ఘనంగా కట్నమిచ్చుకుంటావా
అతడు:
దగ్గరవగానే ఖచ్చితంగా అన్నీ
కత్తిరించుకుంటాగా స్వయంగా
కక్ష తీర్చుకుంటాగా
ఆమె:
సొంత సొమ్ము కాదా పంచి పెట్టుకోనా
పెంచుకున్న లావణ్యం
అతడు:
అంచనాలకైనా అందనీ జాణ
పొంచి ఉన్న సౌందర్యం
ఆమె:
కోకమ్మా పహారా కాస్తూ ఉంటే
కోపగించుకోవాలా రహస్యం కోట దాటిపోవాలా
అతడు:
నన్ను కూడా ఆపేలా వయ్యారం ఒట్టు పెట్టుకోవాలా
||మాఘ మాసం||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)