చిన్నబ్బాయి: నిన్న చూసిన ఉదయం కాదిది… కొత్తగా ఉంది

Audio Song:
 
Video Song:
 
Movie Name  
   Chinnabbayi
Song Singers
   Balu,
   Sujatha
Music Director
   Ilaya Raja
Year Released
   1997
Actors
   Venkatesh,
   Ramya Krishna
Director
   K. Viswanath
Producer
   M. Narasimha Rao

Context

Song Context: 
   ఇంతవరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
   నిన్న చూసిన ఉదయం కాదిది… కొత్తగా ఉంది!
   (A brilliant love song!)

Song Lyrics

||ప|| |ఆమె|
       నిన్న చూసిన ఉదయం కాదిది
       కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
       ఇంతవరకూ ఇన్ని వింతలూ…
       ఇంతవరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
       కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
                               ||నిన్న ||
.
||చ|| |ఆమె|
       చురుకుమంటు పొడిచి లేపే సూర్యకిరణం ఈ వేళ
       కలువ విరిసే చలువ కురిసే కలలు చూపిందే
       వేడి గాలై వెంట తరిమే ఎండకాలం ఈ వేళ
       ఏడు రంగుల ఇంద్రధనువై ఎదుట నిలిచిందే
|అతడు|
       ఈ మాయ మర్మం నాదందువా
       నీలోని భావమే కాదందువా
       ఈనాడే కలిగినా నీ మెలకువ
       చూపించనేమో తొలివేకువ
       ఈ సుప్రభాతమే వినిపించు గీతం నీ గుండెలోనే..లేదందువా??
                               ||నిన్న ||
.
||చ|| |ఆమె|
       మంత్రమెవరో వేసినట్టు మట్టిబొమ్మే ఈ వేళ
       నమ్మలేని నాట్యకళతో నడిచి వచ్చిందే
       మాయ ఏదో జరిగినట్టు మంచు ఋతువే ఈ వేళా
       వేల వన్నెల పూలు తొడిగి పలకరించిందే
|అతడు|
       నీ కంటి ముందర ఈ రంగులు
       నీలోనే దాగిన శ్రీకాంతులు
       నీ గుండె ముంగిటా ఈ ముగ్గులు
       నీ ఊహలోనే సంక్రాంతులు
       ఏ రమ్య చిత్రం ఈ రమ్య చైత్రం
       సత్యం శివం సుందరం
                           || నిన్న ||
.
.
              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)