చిన్నబ్బాయి: వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని

Audio Song:
 
Movie Name  
   Chinnabbayi
Song Singers
   Balu,
   Chitra,
   Malgadi Shubha
Music Director
   Ilaya Raja
Year Released
   1997
Actors
   Venkatesh,
   Ramya Krishna
Director
   K. Viswanath
Producer
   M. Narasimha Rao

Context

Song Context: 
    ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి!
    (An interesting love triangle!)

Song Lyrics

||ప|| |ఆమె|
       వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట
       తేటినెలా స్వాగతించెనంట మదిలోన మధువు నింపుకున్న తోట
       తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ…
|అతడు| ఇదేనా నే నేర్పింది
|అతడు| తెలుసుకో                |ఆమె| తెలుసుకో
|అతడు| తెలుసుకో                |ఆమె| తెలుసుకో
|అతడు| ఓ వనమాలి…
|ఆమె|
       తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ  ||2||
       ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
|ఇద్దరు|
       తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
.
||చ|| |ఆమె|
       మూగమనసు లోగిలికి నీలి కళ్లే వాకిలి… ఆ…    ||2||
|అతడు|
       దాగని తలపులతో అవి తెలుపవ స్నేహాంజలి…  ||2||
|ఆమె|
       ఎరుపెక్కిన చెక్కిలిపై అదురుతున్న పెదవులపై
       భాష లేని ప్రేమలేఖ రాసుకునే వేళ
       తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ    ||2|| ఓ వనమాలీ
.
||చ|| |ఆమె1|
       కొత్త టైపు మ్యూసిక్కుల్లో మత్తు రేపే మాజిక్కుంది హొయ్యా…హా..ఆ.
       కుర్రకాలం కవ్విస్తుంది… కొంటెమేళం కావాలంది..సయ్యా..హా..ఆ
       ఆడే న్యూ స్వింగ్తో… పాడే పాప్ సాంగ్తో… భూగోళం ఊగాలి..హొయ్యా… ||కొత్త ||
       నాది జనమంతా మెచ్చే నాట్యం
|అతడు|
       కాదే అది నడుముని విరిచే పైత్యం
|ఆమె1|
       నాలా మెరుపల్లే నువ్వు బ్రేక్ చెయ్
|అతడు|
       హే బాలా నీ తికమక పరుగుకు బ్రేక్ వెయ్
|ఆమె1| నీ చురుకెంత?          |అతడు| ఆ మెరుపెంత
|ఆమె1| ఏది వెయ్ చూస్తా?      |అతడు| చిటికెయ్ చెప్తా
                                  ||నీ చురుకెంత||
|అతడు|
       తక్కిట తక…
       శృతిలయలకు సరిపడ గల జతులివి
       తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
|అతడు|
       ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
|ఇద్దరు|
       తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
.
.
                          (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)