|
Context
Song Context:
పాదాలు నీవంటావా - పయనాలు మాత్రం కావా - పైవాడి పైన భారమా |
Song Lyrics
||ప|| |అతడు|
వరమంటి మనసే పొంది - విసిరేసుకుంటామంటే
పరిహాసమవదా జీవితం
ఉదయాలు ఎదురుగ ఉండి - కను మూసి అడిగేస్తుంటే
పడదోసి పోదా జీవితం
.
||చ|| |అతడు|
పూవంటి మనసును కోసి - ఆ పైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా
దేహాన్ని జ్వాలగ చేసి - జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా
.
||చ|| |అతడు|
ఎడారంత పరిగెడతావా - దరీ దారి లేదంటావా
తడి లేక అలసే ప్రాణమా
పాదాలు నీవంటావా - పయనాలు మాత్రం కావా
పైవాడి పైన భారమా
కాలాన్ని కవ్వించేలా - పని లేని పంతాలేలా
అటు పై విధిపై నిందలా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)