ఆదిత్య369: చిలిపి యాత్రలో

Posted by admin on 13th November 2009 in ఫ్యూచర్ మంజిల్

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aditya369
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Bala Krishna,
   Bhanu Priya
Director
   Singeetam Srinivasa Rao
Producer
   Srimathi AnithaKrishna

Context

Song Context:
      తళతళలాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం!

Song Lyrics

||ప|| |అతడు|
       చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్
       జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
|ఆమె|
       పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ ఘల్
       తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
|అతడు|
       కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
|ఆమె|
       పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో
                                            || చిలిపి యాత్రలో ||
.
||చ|| |అతడు|
       ఎదురుగ ఉంది ఏదో వింత పదపద చూద్దాం ఎంతో కొంత
|ఆమె|
       కలలకు కూడా కొత్తే అవునా కనపడలేదే నిన్నా మొన్నా
|అతడు|
       కనులవిందుగా ఉందీ లోకం కనుక ఇక్కడే కాసేపింకా ఉందాం
|ఆమె|
       కలవరింతలా ఉందీ రాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం
|అతడు|
       ఎవర్నైనా హలో అందాం ఎటేముందో కనుక్కుందాం
|ఆమె|
       టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణము కద ఇది
                                             || చిలిపి యాత్రలో ||
.
||చ|| |ఆమె|
       వినపడలేదా కూ కూ వెల్కం అతిథులమంటూ ఆన్సర్ చేద్దాం
|అతడు|
       తళతళలాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం
|ఆమె|
       మునుపు ఎప్పుడూ లేదీ మైకం మయుడి మిస్టరీ ఏమో ఈ మాలోకం
|అతడు|
       మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్ష్నరీ చెప్పే మాయా మంత్రం
|ఆమె|
       నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం
|అతడు|
       కనుక్కున్న చమత్కారాలన్ని చిలవలుపలవలు కలిపి తెలుపుదాం
                                              || చిలిపి యాత్రలో ||
.
.
                               (Contributed by Nagarjuna)

Highlights

     కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
     పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కపెట్టుకో!
.
     మెదడు విక్టరీ చేసే చిత్రం - తెలివి డిక్ష్నరీ చెప్పే మాయా మంత్రం!
………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)