Movie Name
Iddaru Mitrulu Singers Partha Sarathi, Chitra Music Director
S.A. Raj Kumar Year Released 1999 Actors
Chiranjeevi, Sakshi Sivanand
Ramya Krishna Director K.S. Ravi Kumar Producer A.M. Ratnam
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |అతడు|
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి
అందాల బొమ్మ గీయమ్మా || బంగారం ||
ఇన్నాళ్ల నుంచి కన్న కలలు తెచ్చి
అరుదైన రూపం ఈయమ్మా
పింఛం కుంచెగా మారనీ
మురిపించే చిత్రం చూడనీ
వీరి వీరి గుమ్మాడి వాడి పేరేంటమ్మా అమ్మాడి || బంగారం ||
.
||చ|| |అతడు|
జో..లాలి అని కొత్త రాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ మంచు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మా అంటుంది కమ్మగా పసి పాప తేనె పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
|ఆమె|
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నెలవు ఓ….
|| బంగారం ||
.
||చ|| |ఆమె|
అడగక ముందే అన్నీ చేసి సేవకుడివనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఏ జన్మలోనూ నే తీర్చలేని ఋణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
ఎపుడూ నా కళ్లు చూడని వెలుగే చూపించినావు
ఎపుడూ నా గుండె పాడని మధురిమ నేర్పావు
|అతడు|
నీలి కళ్ళే చిందే తడిలో హరివిల్లే రానీ త్వరలో ఓ….
|ఆమె|
మాతృత్వానికి మగ రూపానివై నాన్నతనంలో తల్లివై
అన్న గుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధిలో
పతినే మించిన తోడువై - బంధుత్వాలకి అందని బంధం
ఉందని చూపిన నేస్తమా
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world