Movie Name
Allari Premikudu Singers S.P. Balu, Chitra Music Director
M.M. Keeravani Year Released 1994 Actors
Jagapathi Babu,
Ramya Krishna, Rambha Director K. Raghavendra Rao Producer Suresh, Satyanand
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |ఖోరస్|
పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
|ఆమె|
పన్నీటి స్నానాలు చేసే వేళలో
|ఖోరస్|
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే అన్నుల మిన్నను అల్లరి పెట్టే
|ఆమె|
కనరాని బాణాలు తాకే వేళలో
|ఖోరస్|
చెయ్యెత్తుతున్నాము శ్రీ రంగసామి చేయూత సాయంగా అందీయవేమి
|అతడు|
నా ప్రేమ సామ్రాజ్య దేవీ పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాధనం కాపాడగా నాదేలే హామీ
|ఆమె|
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సందిటలోనే సమస్తమూ నీవే దయామి
.
||చ|| |ఆమె|
కునుకుండదు కన్నులలోన కుదురుండదు గుండెలలో
అణువణువు కొరుకుతున్నది తీయని మైకం
|అతడు|
ఎదిగొచ్చిన వన్నెల వాన ఒదిగుండదు వంపులలో
చెరనొదిలి ఉరుకుతున్నది వయసు వేగం
|ఆమె|
మనసు పడే కానుకా అందించనా ప్రేమికా
|అతడు|
దహించితే కోరికా సహించకే గోపిక
|ఆమె|
అదిరేటి అధరాలా ఆన అందం చందం అన్నీ నీకే సమర్పయామి
|అతడు|
ఆనందం అంటే చూపిస్తాలే చెలీ ఫాలో మె || పుత్తడి బొమ్మకు ||
.
||చ|| |అతడు|
నులి వెచ్చని ముచ్చటలోన తొలి ముద్దులు పుచ్చుకునే
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసానీ
|ఆమె|
నును మెత్తని సోయగమంతా సరికొత్తగ విచ్చుకునీ
ఎదరొచ్చిన కాముని సేవకి అంకితమవనీ
|అతడు|
అవీ ఇవీ ఇమ్మని అదే పనిగ వేడని
|ఆమె|
ఇహం పరం నువ్వనీ పదే పదే పాడనీ
|అతడు|
తెర చాటు వివరాలు అన్నీ
దేహం దేహం తాకే వేళ సంతర్పయామి
|ఆమె|
సందేహం మోహం తీరే వేళ సంతోషయామి
|| పుత్తడి బొమ్మకు ||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world