Posted by admin on 6th November 2009 in 
మనసు 
				
					
| 
 | 
 Context 
Song Context: 
                 మనసు (mind)   | 
 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు 
       అహో తన పల్లవి పాడే చల్లని రోజు 
       ఇదే ఇదే కుహూ స్వరాల కానుక 
       మరో వసంత గీతిక జనించు రోజు 
                         || అహో ఒక మనసుకు || |ఆమె| 
. 
||చ|| |అతడు| 
       మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది 
       కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది 
|ఆమె| 
       రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమిది 
       శృతి లయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది 
|అతడు| 
       ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం 
       బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం 
|ఆమె| 
       కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది 
       తనే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది 
                                  || అహో ఒక మనసుకు || 
. 
||చ|| |అతడు| 
       చూపులకెన్నడు దొరకనది రంగూ రూపూ లేని మది 
       రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది 
|ఆమె| 
       వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండు మది 
       కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది 
|అతడు| 
       చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం 
       కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం 
|ఆమె| 
       అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే 
       అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది 
                                  || అహో ఒక మనసుకు || 
. 
.  
                      (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
- It can’t speak; however it can make you write beautiful poetry! 
- It can welcome the colorful future by adding music to your life! 
- It can change the colors of the seasons; it can make your life a wonderful song! 
- It can bring the sky to the earth in a moment! 
. 
- You can’t see it - it is not a physical thing, but it can show you the beautiful dreams (future)! 
- It has the warmth of the friendship; it can show you light in the dark being your friend! 
- It is not reachable but it makes your life bright like the moon; it is the music to your life 
- It surprizes you with unasked(unexpected) blessings; it is your best friend! 
…………………………………………………………………………………………….. 
[Also refer to Page 74-75 in సిరివెన్నెల తరంగాలు]  | 
 
 
 | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)