అష్టా చమ్మా: హల్లొ అంటూ పిలిచి కల్లోలం కలిగించి

Audio Song:
 
Video Song:
Movie Name
   Ashta Chamma
Song Singers
   Sri Krishna,
   Sushma
Music Director
   Kalyani Malik
Year Released
   2008
Actors
   Nani,
   Srinivas Avasarala,
   Swathi,
   Bhargavi
Director
   Mohan Krishna Indraganti
Producer
   Ram Mohan

Context

Song Context:

       ఇల్లా రప్పించావే నన్నాకర్షించి అందుకు నీదె పూచి!

Song Lyrics

||ప|| |అతడు|
       హల్లొ అంటూ పిలిచి కల్లోలం కలిగించి
       ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
       అందుకు నీదె పూచి
|ఆమె|
       ఎందుకు నీతో పేచి
|అతడు|
       ఇచ్చెదెదో ఇచ్చి
|ఆమె|
       వచ్చెయ్ నాతో రాజీ
|అతడు|
       కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
|ఆమె|
       పూల వింటి తూపా తళవా ప్రతాపా
|అతడు|
       బెదరకే పాపా
|ఆమె|
       వదలని కైపా
|అతడు|
       నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన
       మగ మనసిది వాలిందె నీపై ఎగిరొచ్చి
|ఆమె|
       నేనేగా ఆపా ఎదురొచ్చి
|అతడు|
       కీడెంచి మేలెంచి
                        ||హల్లొ ఆంటూ||
.
||చ|| |ఆమె|
       ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ
       దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
       ఎందరినే మారుస్తాం
|అతడు|
       ఇంద్రజాలం చేస్తాం
|ఆమె|
       తిమ్మిని బమ్మిని చేద్దాం
|అతడు|
       మన్మధ మంత్రం వేద్దాం
|ఆమె|
       రేయి లాంటి మైకం కప్పుకొని ఉందాం
|అతడు|
       మాయదారి లోకం కంట పడదందాం
|ఆమె|
       మన ఏకాంతం
|అతడు|
       మనకే సొంతం
|ఆమె|
       అష్ట దిక్కులన్ని దుష్ట శక్తులల్లే కట్ట కట్టుకొచ్చి
       చుట్టు ముట్టూ కుంటె యుద్దనికి సిద్ధం అనుకుందాం
|అతడు|
       పద్నాలుగు లోకాలను మొత్తం
|ఆమె|
       ముద్దుల్లో ముంచేద్దాం
                         ||ఆరా తీసే వాళ్ళూ||
.
||చ|| |అతడు|
       పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెప్పుడంట
       పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
       చప్పున చెప్పవె చిట్టి
|ఆమె|
       చంపకె ఊదరగొట్టి
|అతడు|
       దగ్గిర దగ్గిర ఉండి
|ఆమె|
       తగ్గదు బాదరబంది
|అతడు|
       ఆవురావురందీ ఆకలాగనంది
|ఆమె|
       ఆవిరెక్కువుంది అంటుకొకు అందీ
|అతడు|
       తట్టుకోడమెల్లా
|ఆమె|
       ముట్టుకుంటే డిల్లా
|అతడు|
       విస్తరాకు నిండ విస్తరించి వున్న
       విందుచూసి కూడా పస్తులుండమని
       ఎవ్వరిది శాసించిన పాపం
|ఆమె|
       ఎవ్వరిపై చూపిస్తాం కోపం
|అతడు|
       అయినా పెడతా శాపం
                         ||హల్లొ అంటూ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

Quite an interesting - supposedly a quiet - discussion :)
……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)