అష్టా చమ్మా: నమ్మాలో లేదో ఏ మూలో ఏదో

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Ashta Chamma
Song Singers
   Sri RamaChandra,
   Manasa Veena
Music Director
   Kalyani Malik
Year Released
   2008
Actors
   Nani,
   Srinivas Avasarala,
   Swathi,
   Bhargavi
Director
   Mohan Krishna Indraganti
Producer
   Ram Mohan

Context

Song Context:
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా

Song Lyrics

||ప|| |అతడు|
       నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
|ఆమె|
       నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషంగా ఉంది తెరలో
|అతడు|
       చూస్తూనే ఉన్నా
|ఆమె|
       అవునా అంటున్నా
|అతడు|
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
|ఆమె|
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
|అతడు|
       నువ్ నువ్ నువ్ నువ్వే నువ్వే నువ్వే… నువ్వే
                                         ||నమ్మాలో లేదో||
.
||చ|| |ఆమె|
       పరవాలేదు పరువేమి పోదే పరదాలోనే పడి ఉండరాదే
       పరుడేం కాదు వరసైన వాడే బిడియం దేనికే హృదయమా
|అతడు|
       చొరవేం చేస్తే పొరపాటేం కాదే వెనుకడుగేస్తే మగజన్మ కాదే
       తరుణం మించి పోనీయరాదే మనసా ఇంత మోమాటమా
|ఆమె|
       మామూలుగా ఉండవే
|అతడు|
       ఏ సంగతీ అడగవే
|ఆమె|
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
|అతడు| 
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
       నువ్ నువ్ నువ్ నువ్వే నువ్వే నువ్వే… నువ్వే
                                            ||నమ్మాలో లేదో||
.
||చ|| |అతడు|
       పసిపాపాయి కేరింత కొంత గడుసమ్మాయి కవ్వింత కొంత
       కలిసొచ్చింది కలగన్న వింత కనుకే ఇంత ఆశ్చర్యమా
|ఆమె|
       ఊళ్లో ఉన్న ప్రతి కన్నె కంట ఊరించాలి కన్నీటి మంట
       వరమే వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందమా
|అతడు|
       కొక్కొరొకో… మేలుకో
|ఆమె|
       కైపెందుకో… కోలుకో
|అతడు|
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
|ఆమె|
       అయ్ బాబోయ్ నువ్వా..
       నువ్ నువ్ నువ్ నువ్వా…నువ్ నువ్ నువ్ నువ్వా… నువ్వా నువ్వా
|అతడు|
       నువ్ నువ్ నువ్ నువ్వే నువ్వే నువ్వే… నువ్వే
                                               ||నమ్మాలో లేదో ||
                                         ||అయ్ బాబోయ్ నువ్వా||
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)