ఆవును! వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు: నాలో నేను లేనే లేను… ఎపుడో నేను నువ్వయ్యాను

Posted by admin on 1st May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Avunu! Valliddaru
   ishta paddaru
Singers
   Sandeep, Kousalya
Music Director
   Chakri
Year Released
   2002
Actors
   Ravi Teja, Kalyani
Director
   Vamsi
Producer
   Valluri Ramesh

Context

Song Context: A Romantic Song

Song Lyrics

||ప|| |ఆమె|
       నాలో నేను లేనే లేను…
       ఎపుడో నేను నువ్వయ్యాను
       అడగక ముందే అందిన వరమా
       అలజడి పెంచే తొలి కలవరమా
       ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ || 2 ||
.
||చ|| |ఆమె|
       మొన్నా నిన్నా తెలియదే అసలు || 2 ||
       మదిలోన మొదలైన ఈ గుసగుసలు
       ఏం తోచనీకుంది తీయని దిగులు
       రమ్మని పిలిచే కోయిల స్వరమా
       కమ్మని కలలే కోరిన వరమా
       ఎందాక సాగాలి ఈ పయనాలు
       ఏ చోట ఆగాలి నా పాదాలు
|అతడు|
       నాలో నేను లేనే లేను
       ఎపుడో నేను నువ్వయ్యాను
       అడగక ముందే అందిన వరమా
       అలజడి పెంచే తొలి కలవరమా
       ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా || 2 ||
.
||చ|| | అతడు |
       ఎన్నో విన్నా జంటల కథలు || 2 ||
       నను తాకనేలేదు ఆ మధురిమలు
       కదిలించనేలేదు కలలు అలలు
       గత జన్మలో తీరని రుణమా
       నా జంటగా చేరిన ప్రేమా
       నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
       నా శ్వాసతో నిన్ను పెంచిందేమో
|ఆమె|
       నాలో నేను లేనే లేను
       ఎపుడో నేను నువ్వయ్యాను
       అడగక ముందే అందిన వరమా
       అలజడి పెంచే తొలి కలవరమా
       ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ||2||
                         |ఆమె| |అతడు|
.
.
    (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)