Movie Name
Seenu Singers Partha Sarathi, Chitra Music Director
Mani Sharma Year Released 1999 Actors
Venkatesh, Twinkle Khanna Director Sasi Producer R.B. Chowdary
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |అతడు|
అల్లో నేరేడు కళ్ళదానా - ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా
|ఆమె|
హల్లో వర్ణాల పూలవాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
|అతడు|
నమ్మేదెలా మైనా - ఇంత ప్రేమ నా మీదేనా
|ఆమె|
కల్లో లేదీ నాయన - అల్లుకుంటూ ఒళ్ళో లేనా
|| అల్లో నేరేడు ||
.
||చ|| |అతడు|
దాయి దాయి అనగానే చేతికందేనా చంద్రవదనా
|ఆమె|
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా
|అతడు|
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
|ఆమె|
ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా
|అతడు|
రెప్ప మూసినా తప్పుకోనని కంటిపాప ఇంటిలోన
ఏరికోరి చేరుకున్న దీపమా || అల్లో నేరేడు ||
.
||చ|| |ఆమె|
అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్ని నా ళ్ళు
|అతడు|
అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె క ళ్ళు
|ఆమె|
మైకం పెంచే మాయతో మూగ సైగే చేసే దాహమా
|అతడు|
మౌనం మీటే లీలతో తేరి రాగం నేర్పే స్నేహమా
|ఆమె|
ఒంటరైన నా గుండె గూటిలో
సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా
|| అల్లో నేరేడు ||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world