శత్రువు: పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

Posted by admin on 1st May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Satruvu
Singers
   S.P. Balu, Chitra
Music Director
   Raj Koti
Year Released
   1991
Actors
   Venkatesh, Vijaya Santhi
Director
   Kodi Rama Krishna
Producer
   M.S. Raju

Context

Song Context: A Love Song

Song Lyrics

||ప|| |అతడు|
       పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
       మౌనంగా పుట్టావా దీపికా హోయ్ స్నేహంతో మీటావా మెల్లగా
       తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి ముత్యాల ముగ్గులు పెట్టి వన్నెల వాకిట్లో
|ఆమె|
       పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
.
||చ|| |అతడు|
       ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మ
           - ఓ రబ్బరు బొమ్మ లాలించేదెట్ట చెప్పమ్మ
|ఆమె|
       మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో
          - ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో
|అతడు|
       నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికి
|ఆమె|
       ముందూ మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
       ముద్దూ మురిపాలన్ని పండించేదెట్టాగో
|అతడు|
       ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటే చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి
                             || పొద్దున్నే పుట్టింది ||
.
||చ|| |ఆమె|
       నీ కోసం పుట్టాను..నిలువెల్లా పూశాను గుండెల్లో గూడే కట్టాను
       నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు కట్టాను
|అతడు|
       నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళెంలో కాపురమెట్టాను
       నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను
|ఆమె|
       శృంగార స్నేహాల సంకెళ్లు వేయాలా సింగారి చిందాటతో
|అతడు|
       ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి
       కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా
|ఆమె|
       పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో
       పగలేదో రేయేదో తెలియదు లేవయ్యో
                           || పొద్దున్నే పుట్టింది ||
.
.
           (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)