నిర్ణయం: ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం

Posted by admin on 1st May 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nirnayam
Singers
   S.P. Balu, Janaki
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Nagarjuna, Amala
Director
   Priya Darshan
Producer
   D. Kishore

Context

Song Context:
      A Love Song

Song Lyrics

||ప|| |ఆమె|
       ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
       ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
       వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
       వెయ్యేళ్ళ వియ్యాలతో
|అతడు|
       పదపదపదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
       యదయద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
       విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గూ సింగారం చిందే సిందూరం
       వయ్యారి నెయ్యాలతో || ఎపుడెపుడెపుడని ||
.
||చ|| |ఆమె|
       తీయందించి తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
|అతడు|
       బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
|ఆమె|
       నవనవమను పరువం ఫలించే పరిణయ శుభతరుణం
|అతడు|
       కువకువమను కవనం లిఖించే కులుకుల కలికితనం
|ఆమె|
       నా హృదయమై వెలిగే ప్రియవరం || ఎపుడెపుడెపుడని ||
.
||చ|| |అతడు|
       వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
|ఆమె|
       సయ్యంటున్నా తీయగా నిజం స్వర్గందించే స్నేహమా
|అతడు|
       పెదవుల ముడిపెడదాం యదల్లో మదనుడి గుడి కడదాం
|ఆమె|
       వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం
|అతడు|
       రా వెతుకుదాం రగిలే రసజగం || ఎపుడెపుడెపుడని ||
.
.
          (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)