సంబరం: ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు

Posted by admin on 1st May 2009 in ఘర్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Sambaram
Singers
   R.P. Patnaik
Music Director
   R.P. Patnaik
Year Released
   2003
Actors
   Nitin, Nikitha
Director
   Dasharath
Producer
   Teja

Context

Song Context:
   A boy who lost her is trying to start a new life!

Song Lyrics

||ప|| |అతడు|
       ఎందుకే ఇలా గుండె లోపల
       ఇంత మంట రేపుతావు అందని కలా
       అన్ని వైపులా అల్లుకోకిలా…
       ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
       వెంటాడుతు వేధించాలా - మంటై నను సాధించాలా
       కన్నీటిని కురిపించాలా - జ్ఞాపకమై రగిలించాలా
       మరుపన్నదే రానీయవా - దయలేని స్నేహమా 
                                    ||ఎందుకే ఇలా||
.
||చ|| |అతడు|
       తప్పదని నిను తప్పుకుని - వెదకాలి కొత్త దారి
       నిప్పులతో మది నింపుకుని - బతకాలి బాటసారి
       జంటగా చితి మంటగా గతమంతా వెంట ఉందిగా
       ఒంటిగా నను ఎన్నడూ ఒదిలుండనందిగా
       నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి
       ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి                   
                                     ||ఎందుకే ఇలా||
.
||చ|| |అతడు|
       ఆపకిలా ఆనాటి కలా అడుగడుగు తూలిపోదా
       రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక
       జన్మలో నువు లేవనీ ఇకనైన నన్ను నమ్మనీ
       నిన్నలో వదిలేయని ఇన్నాళ్ల ఆశనీ
       చెంతే ఉన్నా సొంతం కావనీ నిందించే కన్నా…
       నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా             
                                      ||ఎందుకే ఇలా||
.
.
                       (Contributed by Nagarjuna)

Highlights

తప్పదని నిను తప్పుకుని - వెదకాలి కొత్త దారి [Past is past, It is not the end of it. Let me start a new begining!]
.
“నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్న” [And I know how to go away when necessary]
……………………………………………………………………………………………….

4 Responses to “సంబరం: ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు”

  1. Sri Harsha Kiran Says:

    Hi,

    కొత్త మంట రేపుతావు should be ఇంత మంట. The pain is in the past, it can’t be new.

    బతుకంట వెంట ఉందిగా should be గతమంతా వెంట ఉందిగా. He wants to start a new life and his past is haunting him.

    నిందలో వదిలేయని ఇన్నాళ్ల ఆశనీ should be నిన్నలొ వదిలేయని ఇన్నాళ్ల ఆశనీ. He wants to leave the hopes in the past.

    Please make the corrections…

    And thanks for correcting the “Evaru Rayagalaru” song.

    Regards,
    Sri Harsha.

  2. Sri Harsha Kiran Says:

    Sorry.. Missed this one..

    నువ్వూ నీ చిరునవ్వూ చేలని should be నువ్వూ నీ చిరునవ్వూ చేరని.
    Thanks.
    Sri Harsha.

  3. admin Says:

    Sri Harsha,
    Thank you very much for taking time to send the corrections. Your help makes the site as perfect as possible.
    We depend on lyric lovers like you to get everything right!
    All the typos are fixed now!

  4. Ramesh Samineedi Says:

    చెంతే ఉన్నా సొంతం కావనీ నిందించే కన్నా…
    నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా…

    What is this man made of !!!!!!!!!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)