|
Song (Happy) Lyrics
Song Context:
ఆకాశగంగా దూకావే పెంకితనంగా, జలజల జడిగా తొలి అలజడిగా,
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా!
.
||ప|| |అతడు|
ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా
జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా
||ఆకాశగంగా||
.
||చ|| |అతడు|
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
||కనుబొమ్మ ||
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలోనే విన్నా నీ అలికిడి
||ఆకాశగంగా||
.
||చ|| |అతడు|
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
||ఈ పూట ||
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
||ఆకాశగంగా||
.
.
(Contributed by Nagarjuna) |
Song (Sad) Lyrics
Song Context:
ముగిసిన కధగా మిగలని స్మృతిగా, ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా!
.
||ప|| |అతడు|
ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశగంగా
ముగిసిన కధగా మిగలని స్మృతిగా
కదలవె త్వరగా కడలికి జతగా
ఈ మంచుకొండని విడిచి వెళ్ళాలిగా
||ఆకాశగంగా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
Sweetest Lyrics!
………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)