వాన: ఎదుట నిలిచింది చూడు & వెంటపడుతుంది చూడు

Audio (Male) Song:
Audio (Female) Song:
 
Video (Male) Song:
 
Movie Name
   Vaana
Song (Male) Singers
   Karthik
Song (Female) Singers
   Chitra
Music Director
   Kamalakar
Year Released
   2008
Actors
   Vinay Rai,
   Meera Chopra
Director
   M.S. Raju
Producer
   M.S. Raju

Song (Male) Lyrics

Song Context:
      మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా!
.
||ప|| |అతడు|
       ఎదుట నిలిచింది చూడు
       జలతారు వెన్నెలేమో
       ఎదను తడిపింది నేడు
       చినుకంటి చిన్నదేమో
       మైమరచిపోయా మాయలో
       ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…
                             ||ఎదుట ||
.
||చ|| |అతడు|
       నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
       కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
       అవునో కాదో అడగకంది నా మౌనం
       చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
       చెలిని బంధమల్లుకుందే జన్మఖైదులా
                            ||ఎదుట ||
.
||చ|| |అతడు|
       నిన్నే చేరుకోలేక ఎటెళ్లిందో నా లేఖ
       వినేవారు లేక విసుక్కుంది నా కేక
       నీదో కాదో రాసున్న చిరునామా
       ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
       వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
                           ||ఎదుట ||
.
.
         (Contributed by Nagarjuna)

Song (Female) Lyrics

Song Context:
    మది మునిగిపోయే మత్తులో మధురమైన యాతనేదో బయటపడదెలా!
.
||ప|| |ఆమె|
       వెంటపడుతుంది చూడు
       కనపడని మంట ఏదో
       బదులు అడిగింది నేడు వినపడని విన్నపమేదో
       మది మునిగిపోయే మత్తులో
       మధురమైన యాతనేదో బయటపడదెలా
                           ||వెంటపడుతుంది||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights (1 & 2)

   నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
   కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
   అవునో కాదో అడగకంది నా మౌనం
   చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
   చెలిని బంధమల్లుకుందే జన్మఖైదులా
.
   Enjoy the complete lyrics!
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)