వాన: డోలారే దుమారం దేఖోరే అరె అరె అనరే బాపురే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Vaana
Song Singers
   Ranjith
Music Director
   Kamalakar
Year Released
   2008
Actors
   Vinay Rai,
   Meera Chopra
Director
   M.S. Raju
Producer
   M.S. Raju

Context

Song Context:
     మనింటిలో వేడుక విన్నంతటా హంగామా,
     జగాలకే చాటగా జువ్వల్ని ఎగరేద్దామా

Song Lyrics

||ప|| |అతడు|
       డోలారే దుమారం దేఖోరే
       అరె అరె అనరే బాపురే
       ఝూమోరే ఝమాఝం నాచోరే
       హుర్రే హుర్రే అనదా ఊపిరే
       అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా
       అరె కళ్లలోన కులికిందా హరివిల్లు నేడిలా
       కింద మీద చూడనంటు సందడేదో ఆగనంటు బొంగరాల గింగిరాల తందనాలు రేగు వేళ
                                                                        ||డోలారే||
.
||చ|| |అతడు|
       మనింటిలో వేడుక విన్నంతటా హంగామా
       కళ్యాణమే చూడగా కంగారు కలిగిద్దామా
       జగాలకే చాటగా జువ్వల్ని ఎగరేద్దామా
       చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా
       దీవాళి రావాలి పగలే ఇలా
       రంగేళి రేగాలి నలువైపులా
       నింగి నేల ఏకమైన రంగరంగ వైభవాన చెంగు చెంగు చెంగుమంటు చిందులాట సాగు వేళ
                                                                     ||డోలారే||
.
||చ|| |అతడు|
       పొద్దెక్కిన లేవక బజ్జోకుమా పాపాయి
       నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపెయ్యి
       కుర్రాళ్లతో దీటుగా కుంగ్-ఫూలవి మానెయ్యి
       ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లాలుగా అడుగెయ్యి
       అమ్మయ్యే లోగానే అమ్మాయివై తీరంతా మార్చాలి ఆరిందావై
       పిల్లదానా నీ బడాయి చెల్లదింక ఆకతాయి
       అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ
                                                          ||డోలారే||
.
.
                                    (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

;

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)