|
Context
Song Context:
చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన! |
Song Lyrics
||ప|| |అతడు|
సిరిమల్లె వాన పడుతోంది లోన
కనిపించదే కంటికి
|ఆమె|
వడగళ్ల వానా ఉరిమింది ఐనా
వినిపించదే జంటకి
తడిసే తరుణానా గొడుగై నే లేనా
సిరిమల్లె….
||సిరిమల్లె వాన||
.
||చ|| |అతడు|
వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
|ఆమె|
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
|అతడు|
చినుకై వచ్చావే వరదై ముంచావే
సిరిమల్లె….
||సిరిమల్లె వాన||
.
||చ|| |ఆమె|
చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన
|అతడు|
తగువుకి చేరి తలపుగ మారి నిలిచా నీలోన
|ఆమె|
మనసే ఈ వింత మునుపే చూసిందా
సిరిమల్లె…
||సిరిమల్లె వాన||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)