Movie Name
Aahwaanam Singers
S.P. Balu, Chitra, Chorus Music Director
S.V. Krishna Reddy Year Released 1997 Actors
Srikanth, Ramya Krishna Director S.V. Krishna Reddy Producer T. Trivkramam Rao
Context
Song Context: ఓ యుగళ గీతం
Song Lyrics
||ప|| |ఆమె|
ఎంతటివాడే చిన్నికృష్ణుడు
తుంటరివాడే కొంటెకృష్ణుడు
నా వెన్నమనసే కొల్లగొనెనే ఇలాగే
కోరస్:
ఏలాలో ఏలాలో ఏలాలో ఏలాలో
అతడు:
అందరివాడు కాడు కృష్ణుడు
నమ్మవే వీడు సత్యదాసుడు
నీ సంపదలకు సొంపువలకు తలొంచెను
అతడు & కోరస్:
ఏలాలో ఏలాలో ఏలాలో ఏలాలో
.
||చ|| |ఆమె|
పదారువేల పడుచుకన్నెల పదహరాణాల పసిడివన్నెలు
దక్కిన చిన్నోడే తక్కువ అన్నాడే
పక్కకి చూస్తాడే చిక్కులు తెస్తాడే
|అతడు|
పగడపు పెదవులలో పడతుల నవ్వులలో
మంచిముత్యముల సిరి నను ముంచివేసెనే మరి
|ఆమె|
ఓహోహో పావురమా ఓహోహో పావురమా
|అతడు| ఓ దట్స్ ద మెలొడి హా
.
||చ|| |ఆమె|
పరాగ్గా ఉంటే పరుగు తీస్తడు
పరాయి ఇంటే పడక వేస్తడు
ఏమిటి చెయ్యాలే ఎట్టా కాయాలే
లీలలు మానేలా ఏమిటి ఇవ్వాలే
|అతడు|
కనకపు కులుకులతో సొగసుల సొమ్ములతో
కట్టిపెట్టుకో చెలి ఆకట్టి పట్టుకో మరి
|ఆమె| ఓహోహో పావురమా ఓహోహో పావురమా
|అతడు| వాహ్ క్యా అవాజ్ హై జానేమన్
|కోరస్| హే కృష్ణా |అతడు| నో నో
|కోరస్| ముకుందా |అతడు| నై నై
|కోరస్| మురారి
.
.
(Contributed by Prabha)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world