ఆహ్వానం: హాయ్ హాయ్ మేనక

Posted by admin on 26th June 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aahwaanam
Singers
   Hariharan, Chitra, Chorus
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1997
Actors
   Srikanth, Ramya Krishna
Director
   S.V. Krishna Reddy
Producer
   T. Trivkramam Rao

Context

Song Context: ఓ అద్భుతమైన ప్రేమ గీతం!

Song Lyrics

||ప|| |అతడు|
       హాయ్ హాయ్ మేనక ఇయ్యవే కానుక
       దేవకన్య లాగా నిన్ను చూసుకోన
       చేతనైన సేవలన్ని చేసుకోన
       నీ సోకులన్నీ ఏలుకోనా నీ చక్రవర్తినైపోన
|ఆమె|
       జై జై నాయక చేసుకో వేడుక
       పూజలన్ని పూతకొచ్చేననుకోన
       మోజుపడ్డ అందమిచ్చి అల్లుకోన
       నీ నీడనే నమ్ముకోన నీ జోడునై కమ్ముకోన
.
||చ|| |అతడు|
       బంగారమే ఈ భామగా నన్ను చేరవచ్చెనా ఆ స్వర్గమే దించెనా
       ఈ శృంగారమే నా సొంతమై తన నిగనిగనిధులను రాసి ఇచ్చెనా
       నా దశ తిరిగిందని భావించానా
|ఆమె|
       జగమే మరచి జతకలిసాను సగమై నీలో ఒదిగుంటాను
       మాసిపోని మమకారమున్న మదిలోకి నడిచివచ్చా
       నా శ్వాసలోని చిగురాశలన్ని నీ చేతిలోన ఉంచా
       నీదు పాదాల సాక్షిగా నీవే రక్షా ||హాయ్||
.
||చ|| |ఆమె|
       ఇన్నాళ్ళుగా నా కళ్ళలో కమ్మనైన కలలు చెప్పుకున్న కథలు
       నీ కౌగిళ్ళలో ఈ వేళలో నా ఎదురుగా నిలిచేను ఈనాటికి
       ఈ మధురిమ చెదరదు ఏనాటికి
|అతడు|
       నవరతనాల నీ నవ్వులలో ఉదయమురాదా నడిరాతిరిలో
       వెతుకుతున్న నా వేగుచుక్కని నీ రూపంలోనే చూశా
       ఆ నింగిదాక ఓ నిచ్చెనేసి నా ఒడికి నిన్ను దించా
       నీదు అందాల సాక్షిగా నీవే లక్షా ||జై జై ||
.
.
                             (Contributed by Prabha)

Highlights

……………………………………………………………………………………

;

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)