Movie Name
Aahwaanam Singers
S.P. Balu, Chitra Music Director
S.V. Krishna Reddy Year Released 1997 Actors
Srikanth, Ramya Krishna Director S.V. Krishna Reddy Producer T. Trivkramam Rao
Context
Song Context: విడాకుల మహోత్సవ ఆహ్వానం!
Song Lyrics
||ప|| |అతడు|
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వూ రామ్మా.. ఓ వేదమా
విడాకుల పత్రిక అందుకొని వెంటనే వేంచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా
||పందిరి||
.
||చ|| |అతడు|
ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిపడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
|ఆమె|
నీ రాతకు ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వూ రామ్మా.. ఓ అరుంధతి
ఇదే నీ దర్శన బలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా
||పందిరి||
.
||చ|| |అతడు|
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
పతివిడిచిన సతి గమనం ప్రతినిమిషం రగిలిస్తుంది
|ఆమె|
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు
నువ్వూ రామ్మా.. మాంగల్యమా
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకి
విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి
||పందిరి||
.
.
(Contributed by Prabha)
Highlights
Simple, direct, right on target, no one is spared, unbelievable powerful questioning!,
Puts everybody on the defensive, & Supremely confident (ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ, ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు!)
. Observe the lyrics depict “a woman who fights back when pushed around”…
transformed from a mature wife phase. . In summary if you simply follow the lyrics of these songs you will get the complete idea of this movie story. Truly amazing perfection! (Highest standard of the single card lyric writer!)
……………………………………………………………………………………………….
[Also refer to Page 129 in సిరివెన్నెల తరంగాలు & Pages 67-68 in కల్యాణ రాగాలు]
4 Responses to “ఆహ్వానం: పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం”
“నీ రాతలో ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా”
అన్న వరుసలో “నీ రాతకి ” ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా అని వుండాలి. పాత వింటే తెలుస్తుంది. పెద్ద తప్పుగా అనిపించకున్నా కవి రాసినది కాదు కనుక చెప్పాను అంతే! సిరివెన్నెల గారిని అడిగితే బహుసా ‘రాతలో’ అనటానికి ‘రాతకి’ అనటానికి ఎంత వ్యత్యాసం వుందో చెప్పొచ్చు.
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
July 29th, 2010 at 7:38 am
Hi,
ముడేసిన నిన్నటి వేళకి should be ముడేసిన నిన్నటి వేళ్ళకి
ళ ki ళ vattu.
Thanks,
Sri Harsha.
July 29th, 2010 at 3:02 pm
Sri Harsha,
Thanks again. Fixed it!
August 6th, 2010 at 3:48 pm
“నీ రాతలో ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా”
అన్న వరుసలో “నీ రాతకి ” ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా అని వుండాలి. పాత వింటే తెలుస్తుంది. పెద్ద తప్పుగా అనిపించకున్నా కవి రాసినది కాదు కనుక చెప్పాను అంతే! సిరివెన్నెల గారిని అడిగితే బహుసా ‘రాతలో’ అనటానికి ‘రాతకి’ అనటానికి ఎంత వ్యత్యాసం వుందో చెప్పొచ్చు.
August 6th, 2010 at 9:05 pm
Jayashree garu,
You are absolutely right!
Fixed it now.
Please keep them coming.