ఆహ్వానం: మనసా నా మనసా మాటాడమ్మా

Audio Song:
 
 
Movie Name
   Aahwaanam
Singers
   Chitra
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1997
Actors
   Srikanth, Ramya Krishna
Director
   S.V. Krishna Reddy
Producer
   T. Trivkramam Rao

Context

Song Context: నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ!

Song Lyrics

||ప|| |ఆమె|
       మనసా నా మనసా మాటాడమ్మా
       ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా ||మనసా||
       మనసా నా మనసా మాటాడమ్మా
.
||చ||
       చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో
       విన్నా నీ అనురాగపు తేనె పాటని
       మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో
       చూశా నీతో సాగే పూల బాటని
       నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం
       నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం
       నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ ||మనసా||
.
||చ||
       తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా
       అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా
       తనువు మనసు ప్రాణం నీవైన రోజున
       నాదని వేరే ఏదీ మిగిలిలేదుగా
       ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనుకా
       ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా
       నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ ||మనసా||
.
.
                       (Contributed by Prabha)

Highlights

మొగుడైన ప్రతి మగవాడు ఈ పాట సరిగ్గా వింటే తన భార్యని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు!
.
Observe the lyrics depict “a woman & mature wife phase”…
transformed from an innocent girl
and then transforms into a fighter
………………………………………………………………………………………………

2 Responses to “ఆహ్వానం: మనసా నా మనసా మాటాడమ్మా”

  1. Rama Murthy Says:

    Great work!!! I love this website

  2. Narasimha Murthy Says:

    తెలుగు ని చూస్తే … కనువిందు… దానితో పాటు సీతా రామ శాస్త్రి గలారి పదాలు తేనె జల్లు ల ను ఆస్వాదించే మహా భాగ్యం కలిగింది.. ఈ Site వల్ల.
    Great work…. I love this site…
    శాస్త్రి గార్కి పాదాభివందనాలు

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)