అతడు: పిలిచినా రానంటావా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Athadu

Song Singers
   Karthik,
   Kavitha Subramanyam

Music Director
   Mani Sharma
Year Released
   2005
Actors
   Mahesh Babu, Trisha
Director
   Trivikram Srinivas
Producer
   D. Kishore

Context

Song Context: వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా!

Song Lyrics

||ప|| |ఆమె|
       పిలిచినా రానంటావా..కలుసుకోలేనంటావా
       నలుగురూ ఉన్నారంటావా..చిలిపిగా చెంతకు రాలేవా
       తెలివిగా చేరేపోవా తెలియనే లేదా బావా
       అటు ఇటూ చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా
       సమయం కాదంటావా..సరదా లేదంటావా…
       సరసం చేదంటావా బావా
       చనువే తగదంటవా..మనవే విననంటావా
       వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా
|అతడు|
       డొలు బాజా లా ఇలా నా వెంటపడతావా
       చలాకి రోజా ఆగనంటే ఆగనంటావా ||డొలు బాజా లా||
.
||చ|| |ఆమె|
       కనులుంటే సొగసే కనపడదా
       మనసుంటే తగు మార్గం దొరకదా..రాననక
       అనుకుంటే సరిపోదే వనితా..
       అటు పై ఏ పొరబాటో జరగదా…రమ్మ్మనక
|ఆమె|
       పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే
|అతడు|
       తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే
|ఆమె|
       చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి
|అతడు|
       హవ్వా హవ్వాయి అమ్మో అమ్మాయి విన్నానులే
       హవ్వా హవ్వాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి
                                                          ||2||
                                             ||పిలిచినా ||
.
||చ|| |ఆమె|
       మొహమాటం పడతావా అతిగా సుకుమారం
                               చిటికేస్తే చొరవగా చేరవుగా
|అతడు|
       ఇరకాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే
                                    కుదురుగా ఆగవుగా
|ఆమె|
       దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
|అతడు|
       సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా
|ఆమె|
       వరాల బాల వరించవేల తరించనంటూ తగువేల
|అతడు|
       నిగారమిట్టా జిగేలనాల జనం చెడేలా
       నిగారమిట్టా జిగేలనాల జనం చెడేలా జవరాలా || 2 ||
.
.
                           (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)