అతడు: నీతో చెప్పనా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Athadu

Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   Mani Sharma
Year Released
   2005
Actors
   Mahesh Babu, Trisha
Director
   Trivikram Srinivas
Producer
   D. Kishore

Context

Song Context: నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా!

Song Lyrics

||ప|| |ఆమె|
       నీతో చెప్పనా నీకూడా తెలిసినా
       నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
|అతడు|
       గారం చేసినా నయగారం చూపినా
       కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా
|ఆమె|
       నేనే నేనుగా లేనే లేనుగా….
|అతడు|
       నా కన్నుల నీదే వెన్నెలా… ||నీతో చెప్పనా ||
.
||చ|| |ఆమె|
       ఇంకొంచెం అనుకున్నా..ఇక చాల్లే అన్నానా
       వదలమంటే ఏమిటర్థం వదిలిపొమ్మనా
|అతడు|
       పనిమాలా పైపైన పడతావేం పసికూనా
       ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా
|ఆమె|
       మగువ మనసు తెలిసేనా మగజాతికీ
|అతడు|
       మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి..కూత దేనికి
                                 ||గారం చేసినా ||
.
||చ|| |అతడు|
       ఒదిగున్నా ఒరలోన కదిలించకే కుర్రదానా
       కత్తిసాముతో ప్రమాదం పట్టుజారెనా
|ఆమె|
       పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
       కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
|అతడు|
       సొంత సొగసు బరువేనా సుకుమారికి
|ఆమె|
       అంత బిరుసు కరువేనా రాకుమారుడంటి నీ రాజసానికి
                                   ||గారం చేసినా||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)