Movie Name
Johny Song Singers Hari haran, Nanditha Music Director Ramana Gogula Year Released 2003 Actors Pavan Kalyan, Renu Desai Director Pavan Kalyan Producer Allu Aravind
Context
Song Context: A romantic song
Song Lyrics
||ప|| |అతడు|
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
|ఆమె|
ఏవేవో కోరికలు యదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
.
||చ|| |అతడు|
ఓ వరములా దొరికెనీ పరిచయం
నా మనసులో కురిసెనే అమృతం
|ఆమె|
నా నిలువునా అలలయే పరవశం
నీ చెలిమికే చేయనీ అంకితం
|అతడు|
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం || ఏవేవో కోరికలు ||
.
||చ|| |ఆమె|
నీ ఊపిరి వెచ్చగా తగలనీ
నా నుదుటిపై తిలకమై వెలగనీ
|అతడు|
నా చూపులే చల్లగా తాకనీ
నీ పెదవిపై నవ్వుగా నిలవనీ
|ఆమె|
ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం ||ఈ రేయి||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world