Movie Name
Manmadhudu Song Singers Shaan Music Director Devisri Prasad Year Released 2002 Actors Nagarjuna, Sonali Bendre,
Anshu Director Vijaya Bhaskar Producer Nagarjuna Akkineni
Context
Song Context:
He is chasing his lover running away from him!
చెలియా, ఎడబాటే బాటై రానా నీ దాకా!
Song Lyrics
||ప|| |అతడు|
చెలియా చెలియా చేజారి వెళ్లకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీ దాకా..
పడిలేచే కెరటం తీరుగా దిశలన్ని దాటే హోరుగా
నిను తాకే దాకా ఆగదు నా కేక
|| చెలియా ||
.
||చ|| |అతడు|
కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమ
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమ
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా..
అడుగడుగు తడబడుతూ నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా…
|| చెలియా ||
.
||చ|| |అతడు|
నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరు చేసే కాలమా చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా దారిచూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా..
|| చెలియా ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
Lyrics, right on the concept throughout!
నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా చెలియా, నిను తాకే దాకా ఆగదు నా కేక
Amazing stuff!
…………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world