Movie Name
Manasanta Nuvve Song Singers K.K. Music Director R.P. Patnaik Year Released 2001 Actors Uday Kiran, Reema Sen Director V.N. Aditya Producer M.S. Raju
Context
Song Context: ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ,
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ!
Song Lyrics
||ప|| |అతడు|
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
|ఖోరస్|
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమ || 2 ||
.
||చ|| |అతడు|
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనపడుతుందీ ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
|ఖోరస్|
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమ || 2 ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
Focus on these amazing Concepts: 1) అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ .
2) కలవని జంటల మంటలలో కనపడుతుందీ ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
…………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world