Movie Name
Josh Song Singers Sowmya Rao Music Director Sandeep Chowta Year Released 2009 Actors Naga Chaitanya, Karthika Director Vasu Varma Producer Dil Raju
Context
Song Context:Experience the simple pleasures first hand, getting a ride on గాలి (precisely, ఆవారా హవా )
.
Song Lyrics
||ప|| |ఆమె|
నువ్వెళ్ళని చోటుంటుందా నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా
నువు చూసొచ్చిన ప్రతి వింతా నేనెవ్వరికీ చెప్పొద్దా
నీ ఊసులనే ఊకొడుతూ వింటా
ఒక్క చోట నిలవొద్దు అంటూ తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం
ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా ||2||
||నువ్వెళ్ళని||
.
||చ|| |ఆమె|
వేళాపాళా గోళీ మార్ విసిరేసా చూడు వాచీని
అప్పుడప్పుడు నవ్వుదామా టైం టేబుల్ వేసుకుని
దాగుడుమూత దండాకోరు ఎవ్వరికి జాడచెప్పమని
ఇట్టే తప్పించుకోమా ఆపేసే చూపుల్నీ
పట్టకంటూ పట్టించుకోని పాటల్లె సాగనీ పొద్దంతా
ఒద్దు అంటూ ఆపేది ఎవ్వరంటా
కాటుకపిట్టల్లా కళ్ళెగిరి వాలిన చోటల్లా
ఎన్ని వర్ణాలో చూడిల్లా తెలుగు పోగుల్లా
ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా
.
||చ|| |ఆమె|
కిటికీ లోంచి చూడాలా కదిలెళ్ళే అన్ని రుతువుల్ని
చెయ్యారా తాకరాదా వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలని
గుండెల్లొ చొటులేదా ఊరించె ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశమందుకుంటా
ఎల్లలు ఆగేనా అల్లరిగా దూకే వెగానా
అదుపులొ వుంచె వీలెనా నన్ను నెనైనా
ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా
|| నువ్వెళ్ళని||
.
.
(Contributed by Vijaya Saradhi)
Highlights
కిటికీ లోంచి చూడాలా కదిలెళ్ళే అన్ని రుతువుల్ని
చెయ్యారా తాకరాదా వేకువని వెన్నెల్ని!
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలని
గుండెల్లొ చొటులేదా ఊరించె ఊహలకి!
is just an appetizer!
. The context is supposed to bunk the class and enjoy!
The rest is all Sirivennela’s unbelievable conceptualization, even though it is just another movie song!
An exemplary song - for what you will miss if you don’t pay attention to Sirivennela’s lyrics! .
There is plenty of humor starting with ఆవారా హవా! There is a message to busy folks, to put it mildly!
Well, what about deep observations of people!
. ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా
………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world