Movie Name
Nuvvostanante
Nenoddantana Song Singers
Karthik, Sumangali Music Director DeviSri Prasad Year Released 2005 Actors Siddharth, Trisha Director Prabhu Deva Producer M.S. Raju
Context
Song Context: మన చేతిలో ఉంటే కదా ప్రేమించటం మానటం!
Song Lyrics
||ప|| |అతడు|
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
|ఖోరస్|
లల లాయి లాయిలే లల లాయి లాయిలే
|అతడు| || నిలువద్దము ||
.
||చ|| |అతడు|
ప్రతి అడుగు తనకు తానే
సాగిందే నీ వైపు నా మాట విననంటు నేనాపలేనంతగా
|ఆమె|
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
|అతడు|
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
|ఆమె|
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు
|ఖోరస్| లలలాయ్లలే
|అతడు| || నిలువద్దము ||
.
||చ|| |ఆమె|
ఇదివరకు యదలయకు
ఏ మాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారుపెట్టేంతగా
|అతడు|
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు నీ లేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
|ఆమె|
నా దారినే మళ్లించగా నీకెందుకో అంత పంతం
|అతడు|
మన చేతిలో ఉంటే కదా ప్రేమించటం మానటం
|ఖోరస్| లలలాయ్లలే
|అతడు| || నిలువద్దము ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
1) నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
= నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా!
. 2) నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
= నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా!
. Also compare this song with మన్మధుడు: నేను నేనుగా లేనే - conceptually close, eventhough this is a duet and the other one is a solo.
…………………………………………………………………………………
One Response to “నువ్వొస్తానంటే నేనొద్దంటానా: నిలువద్దము నిను ఎపుడైనా”
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
September 11th, 2009 at 1:50 pm
[...] లేనే నిన్న మొన్నలా”! . Also compare this song with నువ్వొస్తానంటే నేనొద్దంటానా: నిలువద