మన్మధుడు: నేను నేనుగా లేనే నిన్న మొన్నలా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Manmadhudu

Song Singers
   S.P. Charan
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Nagarjuna, Sonali Bendre,
   Anshu
Director
   Vijaya Bhaskar
Producer
   Nagarjuna Akkineni

Context

Song Context:
              కళ్లను వదిలెళ్లను అని కమ్మిన మెరుపేదో,
              చెప్పవా కనురెప్పలకే మాటొస్తే!

Song Lyrics

||ప|| |అతడు|
       నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
       లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా…
       ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
       ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
                     ||నేను నేనుగా||
.
||చ|| |అతడు|
       పూలచెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు
       అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు
       తేనెపట్టు రేగినట్టు వీణ మెట్టు ఉలికినట్టు
       ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
       నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా
       మీకెవరికి కనిపించదు ఏమైనా
                     ||నేను నేనుగా||
.
||చ|| |అతడు|
       చుట్టు పక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా
       అంతమంది ఒక్కలాగే కనపడుతుంటే
       తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
       చెప్పలేను నిజమేదో నాకూ వింతే
       కళ్లను వదిలెళ్లను అని కమ్మిన మెరుపేదో
       చెప్పవా కనురెప్పలకే మాటొస్తే
                      ||నేను నేనుగా||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

What a brilliant concept “నేను నేనుగా లేనే నిన్న మొన్నలా”!
.
Also compare this song with నువ్వొస్తానంటే నేనొద్దంటానా: నిలువద్దము నిను ఎపుడైనా - conceptually close, eventhough this is a solo where as the later is a duet.
…………………………………………………………………………………………

One Response to “మన్మధుడు: నేను నేనుగా లేనే నిన్న మొన్నలా”

  1. Sirivennela Seetharama Shastry » Blog Archive » నువ్వొస్తానంటే నేనొద్దంటానా: నిలువద్దము నిను ఎపుడైనా Says:

    [...] పలికే తీయదనం నా పేరేనా! . Also compare this song with మన్మధుడు: నేను నేనుగా లేనే - conceptually close, eventhough this is duet and the other one is a solo. [...]

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)