|
Song (happy times) Lyrics
Context:
If you say you wanna come, why would I say no!
.
||సాకీ|| |అతడు|
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో || 2 ||
పంచవన్నె చిలకలల్లె వజ్జరాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
|| సినుకు ||
.
||ప|| |ఆమె|
ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా!
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా
చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా || 2 ||
తరికిట తరికిట థా
|| ఇన్నాళ్ళకి ||
.
||చ|| |ఆమె|
ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా ఝూకాల్లగా చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగ కాలికి మువ్వల పట్టీల్లాగ
మెళ్లో పచ్చల పతకంలాగ వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా || 2 ||
తరికిట తరికిట థా
|| ఇన్నాళ్ళకి ||
.
||చ|| |ఆమె|
చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా || 2 ||
తరికిట తరికిట థా
|| ఇన్నాళ్ళకి ||
.
.
(Contributed by Nagarjuna) |
Song (separation times) Lyrics
Context:
Still I will never ever say no, If you say you wanna come!
.
||ప|| |అతడు|
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె వానా
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి వాన
తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
|ఆమె|
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
|అతడు|
నువ్వొస్తానంటే హే….నేనొద్దంటానా
|ఆమె|
నువ్వొస్తానంటేఏఏఏ… నేనొద్దంటానా
హా ఆ ఆ ఆ……..
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
Yet another double header masterpiece - the same పల్లవి in two different contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
In the first one:
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా
.
where as in the second one:
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె వానా
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి వాన
తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా
.
What more!
…………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
August 19th, 2010 at 6:14 am
ఒక అమ్మాయి భావాలు ఇంత అద్భుతంగా రాయటం ఒక్క గురువు గారికే చెల్లింది.
జొహార్ గురుజి