ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే: మనసా మన్నించమ్మా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aadavari Matalaki
   Ardhale Verule
Song Singers
   Karthik, Chorus
Music Director
   YuvanSankar Raja
Year Released
   2007
Actors
   Venkatesh, Trisha
Director
   Sri Raghava
Producer
   N.V. Prasad,
   Sanam Naga Ashok Kumar

Context

Song Context:
     ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా!

Song Lyrics

||ప|| |అతడు|
       మనసా మన్నించమ్మా మార్గం మళ్లించమ్మా
       నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
       స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదురుందమ్మా
       పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా
       ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా || 2 ||
.
||చ|| |అతడు|
       దేవాలయంలా ఉంటే నీ తలపు
       ప్రేమ దైవం లా కొలువుంటుందమ్మా
       దావానలంలా తరిమే నిట్టూర్పు
       ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
       అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా
       చెంతకొస్తే మంటేనే అందడని నిందిచొద్దమ్మా
       మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
       తన సౌఖ్యం నిత్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
       ప్రేమా ప్రేమా నీ స్నేహంలో తీరని శాపం మరిపిస్తావా
.
||చ|| |అతడు|
       ఒక చినుకునైనా దాచదు తన కోసం
       నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
       నదులన్నీ తానే తాగే ఆరాటం
       కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం
       పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
       పల్లకీవై పంపించి చల్లగా దీవించవె నేడు
       జ్ఞాపకం లో తీయదనం చేదుగా మార్చవా కన్నీళ్లు
       జీవితం లో నీ పయనం ఇంకనీ ఆపదు నూరేళ్లు
       ప్రేమా ప్రేమా మదిలో భారం కదిలించేలా ఓదార్చవా
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా!
ప్రేమా ప్రేమా నీ స్నేహంలో తీరని శాపం మరిపిస్తావా!
ప్రేమా ప్రేమా మదిలో భారం కదిలించేలా ఓదార్చవా!
…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)