Movie Name Chakram Song Singers
Sankar Mahadevan Music Director
Chakri Year Released 2005 Actors Prabhas, Asin, Charmee Director Krishna Vamsi Producer
C. VenkatRamaraju,
G. SivaRaju
Context
Song Context: పంచాంగం చెబితే గాని పండుగ రానందా!
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా!
Song Lyrics
||బాబు||
క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణా హే రామ రామ రామా
||పిల్లలు||
చిన్నా పెద్దా అంతా పండుగ చెయ్యాలంట
తీపి చేదు అంతా పంచి పెట్టాలంట
.
||ప|| |అతడు|
రంగేళి హోలీ…హంగామా కేళి..
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరిదివ్వెల దీవాళి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి పంచాంగం చెబితే గాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా
||రంగేళి హోలీ||
.
||చ|| |అతడు| తినేది చేదని తెలిసి.. అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమవుతుంది
గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం - నిత్య భద్రపదమవుతుంది లోకుల చీకటి తొలిగించే శుభసమయం కోసం వెతికే
చూపుల దీపాలుగా చేసే జాగరణే… శివరాత్రి ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా
||రంగేళి హోలీ||
.
||చ|| |అతడు| తల్లుల జోల పదాలే గొల్లల జానపదాలై
నరుడికి గీతా పదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామనవమయింది మనలో మనమే కలహించి మనలో మనిషిని తలపించి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుందీ.
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగి మంటయింది
మరి ముంగిలిలో ముగ్గే వేసే శాంతే సంక్రాంతి
.
|అతడు|
ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకట్లై ఎవరి ముసుగులో వాళ్లున్నామంతే నిన్నూ నన్నూ కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే…మనిషితనం ఒకటే!
.
.
(Contributed by Nagarjuna)
Highlights
A mind-boggling masterpiece!
Read and understand each line!
That is the siginificance of these festivals!
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world