చక్రం: కొంచెం కారంగా కొంచెం గారంగా

Posted by admin on 9th October 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Chakram
Song Singers
   Kousalya
Music Director
   Chakri
Year Released
   2005
Actors
   Prabhas, Asin, Charmee
Director
   Krishna Vamsi
Producer
   C. VenkatRamaraju,
   G. SivaRaju

Context

Song Context:
       A Love Song

Song Lyrics

||ప|| |ఆమె|
       కొంచెం కారంగా కొంచెం గారంగా
       కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
       అందించనీ అదిరే అధరాంజలి
       బందించనీ కాలాన్నీ కౌగిలి
       సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
       మంచల్లే నిమిరే నీ జాలే మంటల్లే నను మరిగించాలే
                                     ||కొంచెం కారంగా||
.
||చ|| |ఆమె|
       తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
       మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
       నీ విషమే పాకింది నరనరమున
       ఇక నా వశము కాకుంది యమయాతన
       లేనిపోని నిందలు గాని హాయిగానే ఉంది గాని ఉన్నమాట నీతో చెప్పనీ
                                    || కొంచెం కారంగా ||
.
||చ|| |ఆమె|
       అమ్మాయినంటూ నాకే గుర్తుచేస్తూ
       లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
       నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
       నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
       మనసుకంది మన్మథ లేఖ కెవ్వుమంది కమ్మని కేక వయసుకందిపోయే నేడిలా
                                   ||కొంచెం కారంగా||
.
.
                             (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)