గోవిందా గోవిందా: ప్రేమంటే నిజంగా ఏమంటే

Posted by admin on 23rd October 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Govinda Govinda
Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   Raj-Koti
Year Released
   1994
Actors
   Nagarjuna, SriDevi
Director
   Ram Gopal Varma
Producer
   C. Aswani Dutt

Context

Song Context:
         A Love Song

Song Lyrics

||ప|| |అతడు|
       ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం
|ఆమె|
       ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం
|అతడు|
       తొలి చినుకుల తడి ఇదనీ తొలి కిరణపు తళుకిదనీ
|ఆమె|
       తొలి వలపుల తలపిదనీ ఎట్టాగ పోల్చడం
                                 ||ప్రేమంటే నిజంగా||
.
||చ|| |ఆమె|
       ఊటీకైనా చెమటలు పట్టే హీటుంది ఈ ప్రేమలో
|అతడు|
       ఉప్పెనకైనా వణుకులు పుట్టే ఊపుంది ఈ ప్రేమలో
|ఆమె|
       వెనుదిరగని వేగాలతో తొలి కదలిక ఏనాటిదో
|అతడు|
       మునుపెరగని రాగాలతో పిలిచిన స్వరమేమంటదో
|ఆమె|
       జత కుదిరిన క్షణమిదనీ
       ముడి బిగిసిన గుణమిదనీ
|అతడు|
       కథ ముదిరిన విధమిదనీ ఎట్టాగ తేల్చడం
                                   ||ప్రేమంటే నిజంగా||
.
||చ|| |అతడు|
       శంకరుడైనా కింకరుడైనా లొంగాలి లవ్ ధాటికి
|ఆమె|
       పండితుడైనా పామరుడైనా పసివాడే సయ్యాటకి
|అతడు|
       తుది ఎరగని ప్రేమాయణం మొదలెపుడని ఊహించడం
|ఆమె|
       గత చరితల పారాయణం గతులెన్నని వివరించడం
|అతడు|
       పరులెరగని అనుభవమై పదపదమను అవసరమై
|ఆమె|
       పయనించే ప్రణయ రథం ఎటు పరుగుదీయునో
                                    ||ప్రేమంటే నిజంగా ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

  [Also refer to Page 139 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)