హరే రాం: జై రాం జై రాం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Hare Ram
Song Singers
   Mickey J. Meyer
Music Director
   Mickey J. Meyer
Year Released
   2008
Actors
   Kalyan Ram,
   Priya Mani,
   Sindhu Tulani
Director
   HarshaVardhan
Producer
   Kalyan Ram

Context

Song Context:
     ఆవారా గాలిని బంధిస్తారా? కెరటాలకు కొరడా చూపిస్తారా?

Song Lyrics

||ప|| |అతడు|
       ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం - పొందిగ్గా ఉండం, పరిగెడుతూ ఉందాం!
       పక్షుల్లా పోదాం నక్షత్రాలౌదాం! - నింగి అందాలందాం నిచ్చెనలు వేద్దాం!
       భూలోకం మొత్తం మనకేగా సొంతం - జగమంటే అర్థం మన జంటే అందాం!
       ఎవరూ లేరందాం ఉన్నా అటు చూడం! తొలి ఈవ్ అండ్ ఆడం మనమే అందాం!
       హరిలో రంగ హరి, ఇదేం తమాషే! తారంగం ఆడే జోడి ఖరార్, ఖల్లాస్-యే!
       భాగోతం బాగు అన్నావో సరే, శభాషే! ఐసే తైసే నువ్వంటే చూస్తే!
       ఆనందోబ్రహ్మ అంటూ షికారు చేస్తే, అమ్మోరు పూనినట్టు వీరంగం వేస్తే,
       ఏం దారి చోరా చోరీ తోచింది చేస్తే, చూస్తే గీస్తే మతే మటాషే!
       జంట కుదిరిన జోష్-యే… ఈ కంట పడితే వెంట పడక ఒంటి కళతో ఉంటదా?
       నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే,
       కత్తి పదునై కోసే ఈ కొత్త చినుకు గుండె కొరుకుతుంటె కునుకు పడతదా!
       నరం నరం నములు గరం గరం గుబులు క్షణం క్షణం దిగులు పిచ్చెక్కదా!
       అదో రకం తెగులు అయోమయం సెగలు పుట్టించడం తగని పనే కదా!
.
||ప|| |అతడు|
       లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం, కాకుల్లాగా కవ్విస్తే care a damn అంటాం!
       ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం! మునుముందుకు పోదాం ఆగం మీ కోసం!
       Sayonara, చెయ్యూపి షైరుకు వెళుతున్నాం! సై అన్నారా, సరదాగా సంగతి చెప్పుకుందాం!
       కాదన్నారా que sera sera అనుకుందాం! అస్సలెందుకులే మీ అందరి ఒప్పందం?
       కాపేస్తే కంచెను తెంచుకుపోతాం, ఆపేస్తే తప్పక తప్పుకుపోతాం!
       కోపిస్తే కొండల నుంచి కిందికి వచ్చి గట్టును తెంచి కొంపలు ముంచే గోదారై పోతాం!
       ఆవారా గాలిని బంధిస్తారా? కెరటాలకు కొరడా చూపిస్తారా?
       గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందంటే… నీకే లాభం!
.
       జై రాం, జై రాం, జై జై జై రాం, జై రాం, జై జై జై రాం జై రాం, జై జై జై జై రాం! (2)
                                                        || ఇంకొంచెం ఫ్రీడం ||
.
.
                                  (Contributed by Nagarjuna)

Highlights

….……………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)