|
Context
Song Context:
A teasing love song by the girl |
Song Lyrics
||ప|| |ఆమె|
ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా
కోరుకుంటే ఏదైనా నే కాదంటానా
|అతడు|
యా ఖుదా జర దేఖోనా దూకుతున్నది పైపైన
దిక్కు తొచక ఛస్తున్నా ఏం జోరే జాణా
|ఆమె|
పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి
పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి
|అతడు|
పట్టపగలే రెచ్చి బరితెగించి
పచ్చి వగలే తెచ్చి వెంట రాకే కొంటెగా కవ్వించి
||ప్యార్ కర్నా||
||యా ఖుదా||
.
||చ|| |అతడు|
ఒంటరి ఈడు కదా తుంటరి తొందర ఉండదా
ఎందుకు ఈ పరదా తగునా?
|ఆమె|
అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా
నువ్వది కాదు కదా అవునా
|అతడు|
ఇంతలేసి కళ్లు ఉన్నా గంత లేసుకు కూర్చున్నావ
నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా
|ఆమె|
బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా
గాభరా పడుతున్నానే చాలదా పులి కూనా
||ప్యార్ కర్నా||
||యా ఖుదా||
.
||చ|| |ఆమె|
దక్కిన చుక్కనిలా తక్కువ చేయకు ఇంతగా
మక్కువ దాచకలా మదిలో
|అతడు|
కమ్ముకు రాకే ఇలా తిమ్మిరి పెంచకె వింతగా
గమ్మున ఉండవెలా తెరవో
|ఆమె|
ఆశపడితే ఆగుతుందా రాసకార్యం ఇన్నాళ్లుంటే
మూతపెడితే దాగుతుందా జ్వాల ఆరదు జోకొడితే
|అతడు|
క్యా కరే నాకేం దారి నౌకరీ పోతుంటే
పోకిరి వైఖరి చాలే ఛోకిరి వదిలెయ్వే
||ప్యార్ కర్నా||
||యా ఖుదా||
||పుట్టుకొచ్చే ||
||పట్టపగలే వచ్చి||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)