హరే రాం: సరిగా సరిగా సరిగా పడనీ పడనీ పడనీ ఇపుడే తొలి అడుగు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Hare Ram
Song Singers
   Karthik
Music Director
   Mickey J. Meyer
Year Released
   2008
Actors
   Kalyan Ram,
   Priya Mani,
   Sindhu Tulani
Director
   HarshaVardhan
Producer
   Kalyan Ram

Context

Song Context:
   కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
   మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
   కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే!

Song Lyrics

||ప|| |అతడు|
       సరిగా సరిగా సరిగా
            పడనీ పడనీ పడనీ
                ఇపుడే తొలి అడుగు
       సుడిలో సుడిలో సుడిలో
            పడవై పడవై పడవై
                ఎపుడూ తడబడకు
       మాయలో మగతలో మరపు ఇంకెన్నాళ్లు
       వేకువై వెలగనీ తెరవిదే నీ కళ్లు
       కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
       మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
       కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
       చలో చలో…
                                ||సరిగా సరిగా||
.
||చ|| |అతడు|
       నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
       అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
       సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం
       దీపంలా వెలిగిందా జనులందరిలో
       చంద్రుళ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
       కుందేలై అందంగా కనపడదా నీలా నవ్వే క్షణాలలో
                               ||సరిగా సరిగా||
.
||చ|| |అతడు|
       చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసి
       తొక్కే కాళ్ళే మొక్కే వాళ్లై దైవం అనరా శిలను కొలిచి
       అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
       అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
       అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
       కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు
       చలో చలో..
                               ||సరిగా సరిగా||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుళ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదే నీలా నవ్వే క్షణాలలో
.
చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసి
తొక్కే కాళ్లే మొక్కే వాళ్లై దైవం అనరా శిలను కొలిచి
.
అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)