మనసిచ్చి చూడు: నాలో ఏదేదో అయిపోతున్నది

Audio Song:
 
 
Movie Name
   Manasichi Chudu
Song Singers
   S.P. Balu,
   Sujatha
Music Director
   Mani Sharma
Year Released
   1998
Actors
   Vadde Naveen,
   Rasi
Director
   Suresh Varma
Producer
   M.V. Lakshmi

Context

Song Context:
     ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ల లాగ లేదు కదా!

Song Lyrics

||ప|| |ఆమె|
       నాలో ఏదేదో అయిపోతున్నది
|అతడు|
       అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
|ఆమె|
       నీ తోడు కోరింది నా ఊపిరి..
|అతడు|
       అంతే ఈ ప్రేమ వరసా దాని అంతే చూడాలి వయసా
|ఆమె|
       ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ల లాగ లేదు కదా
|అతడు|
       నీలోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా
                                       || నాలో ఏదేదో ||
.
||చ|| |ఆమె|
       భాష మొత్తమూ మాయమైనదా గుండె మాట గొంతు దాటి రాదే
|ఖోరస్|
       అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
|ఆమె|
       శ్వాస మాత్రమూ గేయమైనదా హాయి పాటలెన్నో మీటుతోందే
|ఖోరస్|
       అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా
|ఆమె|
       నీలో ఏదో కొత్త కోణం చూశా నువ్వు నువ్వేనా కాళిదాసా
|అతడు|
       నీవే కదా నిండు ప్రాణం పోసి దీన్ని పెంచావు కన్నె హంస
|ఆమె|
       ఒక్క మాటే అని కోటి భావాలని అందచెయ్యాలని కొత్త పాఠం ఇదే తెలుసా
                                        || నాలో ఏదేదో ||
.
||చ|| |అతడు|
       కన్ను కొద్దిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమీ చూడలేదే
|ఖోరస్|
       అంతే ఈ ప్రేమ వరసా దాని అంతే చూడాలి వయసా
|అతడు|
       కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంతా ఆగిపోయే ముందే
|ఖోరస్|
       అంతే ఈ ప్రేమ వరసా దాని అంతే చూడాలి వయసా
|అతడు|
       ఏతా వాతా దీని వాటం చూస్తే తీయగా ఉన్న కత్తి కోత
|ఆమె|
       ఇంటా బయటా మొగమాటం పెట్టే తప్పుకోలేని వింత వేటా
|అతడు|
       మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా
       పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా
                                         || నాలో ఏదేదో ||
.
.
                          (Contributed by Nagarjuna)

Highlights

   [Also refer to Pages 144-145 of సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)