|
Context
Song Context:
బట్టీ పట్టడం మానేసి,
గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టు
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాన్ని బయట పెట్టు |
Song Lyrics
||ప|| |అతడు|
బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు! || బోడి చదువులు ||
ఒక్క ఫోజు కొట్టు లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాసు బూట్లు తొడగవ నీకు ఆరు కోట్లు
ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
|| బోడి చదువులు ||
.
||చ|| |అతడు|
చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుంద నీ జుట్టు
థార్ ఎడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ
వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెపుడో నాటిన చెట్లు
పాత డేట్లు బట్టీ వేస్తూ అసలేంటీ కుస్తీ పట్లు
ఐ.క్యు అంటే అర్థం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు
ఆడే పాడే ఈడుని దానికి పెట్టకు తాకట్టు
పనికిరాని చెత్తంతా నింపకు మెదడు చెదలు పట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
|| బోడి చదువులు ||
.
||చ|| |అతడు|
లీకు వీరులకు ముందే తెలుసు క్వస్చన్ పేపర్ గుట్టు
లోక జ్ఞానం కలిగిన వాడే కోచింగ్ సెంటర్ పెట్టు
బాబూ!మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్ట్
గుర్తుపట్టర ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టు
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాన్ని బయట పెట్టు
రేసు హార్సువై లైఫును గెలిచే పరుగు మొదలుపెట్టు
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
|| బోడి చదువులు ||
.
||చ|| |అతడు|
రెండో ఎక్కం రాకపోయినా నీకేమిట్రా లోటు కాలిక్యులేటర్ చేపట్టు డోంట్ వర్రీ
బిల్లు కడితే నీ బెడ్రూంలో వేస్తాడు బాసింపెట్టు సాక్షాత్తూ బిల్ గేట్సు
పిచ్చోడెవరో జుట్టుని పీక్కుని ఎన్నో కనిపెట్టు
పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు
చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటూ
సలహా ఇస్తున్నానని అనుకుంటే అదే రాంగు రూటు
బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు హొయ్
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు
|| బోడి చదువులు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
1998 Manaswini Award Winner!
.
A Sirivennela Classic!
Follow the lyrics and the concept!
Has highest utility value, if you డైజెస్టు ఇట్టు 
.
“అడిడాసు బూట్లు తొడగవ నీకు ఆరు కోట్లు”. Only a certain Sirivennela can land on the point so precisely in such a tickling fashion, yet never wavering from the concept and rhyme!
………………………………………………………………………………………….
NOW THE LINE BY LINE MEANING!
||ప||
These stupid studies is a waste, eating your brains!
Try playing cricket, to become the next Tendulkar!
Just give a pose to get lakhs worth of endorsements!
Adidas shoes advertisement will dress you up with six crores!
Imagine which degrees will make you earn that much!
O innocent Student!
.
||చ||
Knowing the rain fall in Chirapunj doesn’t make your hair wet!
Staying on the bank of Godavari, why bother about Thar desert?
Veerappan would have, long ago, cut down the trees Ashoka has planted!
By hearting those old history dates and why these struggles!
IQ means the first step towards over-smartness!
Do not pledge your youth to these silly studies!
Don’t fill your brain to rust, with these useless/dry facts!
O innocent Student!
.
||చ||
The people who leak already know the questions in the test papers!
Only the shrewd people open coaching centers!
Hey! No scientist has wept (focused on) for marks/grades!
Find out in which field you are interested in!
Everybody has talent in some field!
To become your own boss, first figure that out!
Then run like a race horse to win in that field!
O innocent Student!
.
||చ||
Just because you don’t know the math tables, Don’t Worry, there are calculators!
If you pay money you can bring even Bill Gates to your home!
The mad scientists will invent things by pulling the hair on their heads,
With money you can buy all of them!
If you think I am advising you to drop out of school, you got it all wrong!
I mean, don’t study the things that are not going to help you to live to your strengths/tastes!
O innocent Student!
.
Also Compare this song with: గులాబి: క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ
and with గౌతం SSC: అమ్మా నాన్న అన్నా వదినా we love you so much
.
[Also refer to Pages 200-201 of సిరివెన్నెల తరంగాలు & pages 45-49 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)