|
Context
Song Context:
A (subtle) Teasing Song by her |
Song Lyrics
||ప|| |ఆమె|
చలెక్కిఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే ఉంటావో
|| చలెక్కిఉందనుకో||
.
||చ|| |ఆమె|
చీకటుందని చింతతో నడిరాతిరి నిదరోలేదుగా
కోటి చుక్కలు కాంతితో తనతూర్పు వెతుకునుగా ||చీకటుందని||
నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం
వెలుగివ్వనని ముసుకేసుకొని మసిబారదు ఏ దీపం
|| చలెక్కిఉందనుకో||
.
||చ|| |ఆమె|
కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన
కాలుసాగని నింగిలో ఏకాకి యాత్రలోన ||కారునల్లని||
కలలన్నిటిని వినిపించుకొని నిలవేసినా కళ్ళని
వెలివేసికోని వెళ్ళిపోకుమరి విలువైన విలాసాన్ని
|| చలెక్కిఉందనుకో||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
వెలుగివ్వనని ముసుకేసుకొని మసిబారదు ఏ దీపం!
.
[Also refer to Page 177 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
March 8th, 2011 at 3:52 am
Hi
వెలివేసికోని వెళ్ళిపోకుమరి విలువైనదిరా కాని
should be
వెలివేసికోని వెళ్ళిపోకుమరి విలువైన విలాసాన్ని
Thanks,
Sri Harsha.