|
Context
Song Context:
A professional killer turned normal guy by love
(నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో)
|
Song Lyrics
||ప|| |అతడు|
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
||నీ నవ్వు||
.
||చ|| |అతడు|
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని || 2 ||
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని
పంచేదుకే ఒకరు లేని - బతుకెంత బరువో అని
ఏతోడుకీ నోచుకోని - నడకెంత అలుపో అని
.
||చ|| |అతడు|
నల్లని నీ కనుపాపలలో - ఉదయాలు కనిపించనీ ||2||
వెన్నెల పేరే వినిపించనీ - నడిరేయి కరిగించనీ
నా పెదవిలోనూ ఇలాగె - చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందని
.
||చ|| |అతడు|
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ||2||
తనువూ మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
||నీ నవ్వు||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
[Also refer to Page 80 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 29th, 2010 at 11:25 am
నాకై సాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని
పంచేదుకే ఒకరు లేని - బతుకెంత బరువో అని
ఏతోడుకీ నోచుకోని - నడకెంత అలుపో అని
Who else can write such beautiful lines? Only Sastry Garu can present romantic lyrics with utmost decency.
September 30th, 2010 at 10:10 pm
మొదటి చరణం లో నాకై చాచిన (not సాచిన) నీ చేతిలో…………అని ఉంటుంది గమనించాలి
November 22nd, 2010 at 5:34 am
నా పెదవిలోనూ ఇలాగె …
Ee Lines song lo vintunnapudu verey la vunnai
Oka sari confirm cheyyandi
” Na pedhavilo nudhurilage ..” ani vinipistuhndhi..
December 23rd, 2010 at 2:45 pm
Mohan garu,
Meaning is not matching with your interpretation. Let me double check.
December 25th, 2010 at 6:47 am
Mohan Garu, It is “Naa pedavi lonoo ILAGE”. SPB’s magical smile brings more life to this line. Hats off to him.