|
Context
Song Context:
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ!
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా! |
Song Lyrics
||ప|| |అతడు|
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన || 2 ||
||ఎక్కడ||
.
||చ|| |అతడు|
నిద్దరపుచ్చే మల్లెలగాలి వద్దకు వచ్చ్హి తానెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుంతుందో ఇలా నా యదమాటున
దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన
||ఎక్కడ||
.
||చ|| |అతడు|
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావనీ
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటాననీ
మనసు మునుపు ఎపుడు ఇంత ఉలుకు ఉలికిపడలేదు కదా
మనకు తెలియదిది ఈ వింత
ఎవరి చలవ ఈ గిలిగింత
నా లాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావనా
|| నా నీడైనా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
2000 వంశి బర్ఖిలీ Award Winner!
.
[Also refer to Page 150 of సిరివెన్నెల తరంగాలు & pages 72-73 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)