|
Context
Song Context:
They fall in love after she was engaged!
Girl starts the song as -
Can’t you tell me once, that I love you?
[ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని]
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ ఓ ఓ చెంత చేరి పంచుకోవా ఆశనీ శ్వాసనీ
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళా
|అతడు|
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
ఓ ఓ ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
.
||చ|| |అతడు|
చందమామ మనకందదనీ
ముందుగానె అది తెలుసుకుని
చేయిచాచి పిలవద్దు అని
చంటిపాపలకు చెబుతామా
|ఆమె|
లేనిపోని కలలెందుకని
మేలుకుంటె అవి రావు అనీ
జన్మలోనే నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
|అతడు|
కలలన్నవి కలలని నమ్మననీ
అవి కలవని పిలవకు కలవమని
|ఆమె|
మది మీటుతూన్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
||ఒక్కసారి ||
.
||చ|| |ఆమె|
అందమైన హరివిల్లులతో బంతివేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగివస్తుంటే కరిగిపోని దూరం ఉందా
|అతడు|
అంతులేని తన అల్లరితో
అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే
ఆకాశం తెగిపడుతుందా
|ఆమె|
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
|అతడు|
అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటె తీరిపోదా
||ఒక్కసారి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
This is an interesting ప్రేమ ఘర్షణ song. Follow the logic!
.
కలలన్నవి కలలని నమ్మననీ, అవి కలవని పిలవకు కలవమని!
[Dreams are dreams, don't believe them. They belong only to dreams, don't ask them to become true]
.
|ఆమె|
అందమైన హరివిల్లులతో బంతివేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగివస్తుంటే కరిగిపోని దూరం ఉందా
|అతడు|
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగిపడుతుందా
|ఆమె|
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
|అతడు|
అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటె సరిపోదా
……………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)