అతిధి: సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Athidhi
Song Singers
   Deepu,
   Usha
Music Director
   Mani Sharma
Year Released
   2007
Actors
   Mahesh Babu,
   Amritha Rao
Director
   Surender Reddy
Producer
   G. Ramesh Babu

Context

Song Context:
          నిను నీవే సరిగా కనలేవే మనసా

Song Lyrics

||ప|| |అతడు|
       సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా
       రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
|ఆమె|
       నిను నీవే సరిగా కనలేదే మనసా
|అతడు|
       నడి రాతిరి నడక కడతేరదు తెలుసా
       ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయటపడలేవా
       ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
.
||చ|| |అతడు|
       చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారనీ
       నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ
       జాబిలినీ వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ
       రూపం లేదు కనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
       ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనా
|ఆమె|
       నిను నీవే సరిగా కనలేవే మనసా..
|అతడు|
       నడి రాతిరి నడక కడతేరదు తెలుసా….
.
||చ|| |అతడు|
       పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా
       సంద్రం లో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడో
       సందేహం కలిగిన మదికీ కలతను తీర్చేదెవరో
       శాపం లాగ వెంటపడుతున్న గతం ఏదైనా
       దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)