|
Context
Song Context:
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు ఛాప్టరు |
Song Lyrics
||ప|| |అతడు|
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ || భద్రం బీ కేర్ఫుల్ ||
ఆలికి మెళ్లొ ముళ్లేశానని ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలొచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు ఛాప్టరు
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్లాచారం
జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
చచ్చి చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు
||భద్రం బీ కేర్ఫుల్||
.
||చ|| |అతడు|
పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను, సదాం హుస్సేను, హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో వున్నా పెళ్ళం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా
||భద్రం బీ కేర్ఫుల్||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A popular song with tickling lyrics!
.
[Also refer to Page 199 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
December 11th, 2009 at 9:03 am
music director of this song was mm keeravani…please edit the credits.
December 11th, 2009 at 5:41 pm
Dear Admin,
this song was composed and recorded by Mr MM keeravani..
the audio cassette has wrong information on it’s inlay card…
and BTW SRI antey gaayam ku chesina sri kaadhu.. migilina paatalu compose cheasindi Mr Srimurthy (srinivasa murthy)
December 11th, 2009 at 5:42 pm
also
can u guide me in submitting lyrics for our site…
December 11th, 2009 at 7:07 pm
SS Kanchi gaaru,
Fixed the music director for this song.
Also the music director for the other songs as Sree Murthy.
August 6th, 2010 at 5:15 pm
ఆడియో లోను వీడియో లోను ఒకొక్క చరణం వేరుగా వున్నాయి. సాహిత్యాభిమానులు, సిరివెన్నెల అభిమానులు ఆనందిస్తారనే ఉద్దేశ్యంతో
క్రింద వీడియో లో చరణం కూడా వ్రాసాను. ఇది కూడా ‘భలే’ గా వుంది కదా! సబబు అనిపిస్తే దీనిని కూడా పాటతో కలపండి.
“పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
ఫర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను, సదాం హుస్సేను, హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో వున్నా పెళ్ళం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా”
August 6th, 2010 at 9:25 pm
Jayashree garu,
Thank you very much for not only pointing it out but also providing the complete చరణం.
Posted it now.