రాజా: కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్లకే రావమ్మా

Audio Song:
 
Movie Name
   Raja
Song Singers
   Rajesh,
   Sujatha
Music Director
   S.A. Raj Kumar
Year Released
   1999
Actors
   Venkatesh,
   Soundarya
Director
   Muppalaneni Siva
Producer
   R.B. Chaudhary

Context

Song Context:
   స్వాతి చినుకులా సందె వెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా

Song Lyrics

||ప|| |అతడు|
       కవ్వించకే ఓ ప్రేమా
       కౌగిళ్లకే రావమ్మా
|ఆమె|
       చల్లనైన ఓ ప్రేమ
       చందమామలా రామ్మా
|అతడు|
       తీయనైన ఓ ప్రేమ
       తేనెవానలా రామ్మా
|ఆమె|
       ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
       వేయి కలల చిరునామా ప్రేమా
|అతడు|
       స్వాతి చినుకులా సందె వెలుగులా కొత్త వరదలా రామ్మా ప్రేమా
                                               || కవ్వించకే ||
.
||చ|| |ఆమె|
       అందమైన బంధనాల వరమా
       వందనాల చందనాలు గొనుమా
       కలే తీరగా ఒడే చేరుమా
|అతడు|
       సున్నితాన కన్నె లేత నడుమా
       కన్ను తోనే నిన్ను కాస్త తడిమా
       ఇదే తీరుగా ఎదే మీటుమా
|ఆమె|
       సాయం కావాలన్నదీ ప్రాయం ఓ ప్రేమా
|అతడు|
       చేయందిస్తా రా మరి సరదాపడదామా
|ఆమె|
       నీ వెంటే నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమా
                                                || కవ్వించకే ||
.
||చ|| |అతడు|
       వేడుకైన ఆడ ఈడు వనమా
       వేడి వేడి వేడుకోలు వినుమా
       వయ్యారాలలో విడిది చూపుమా
|ఆమె|
       ఆగలేని ఆకతాయితనమా
       వేగుతున్న వేగమాపతరమా
       సుతారాలతో జతే చేరుమా
|అతడు|
       తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా
|ఆమె|
       భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మా
|అతడు|
       నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమా
                                               || కవ్వించకే ||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)