|
Context
Song Context:
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకు!
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు!
[Things happen (Not everything may work in your favor),
Just move on...] |
Song Lyrics
||ప|| |అతడు|
సంతోషం సగం బలం..హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి
|ఖోరస్| ఓహో ఓహో
||సంతోషం||
.
||చ|| |అతడు|
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా ||2||
చుట్టమల్లే కష్టమొస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతు పరుగులు తీయదా
||నవ్వే నీ కళ్లలో||
|ఖోరస్| ఓహో ఓహో
.
||చ|| |అతడు|
ఆశలు రేపినా అడియాసలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా ||2||
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా
కలలు గని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
||నవ్వే నీ కళ్లలో||
|ఖోరస్| ఓహో ఓహో
|| సంతోషం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Follow the brilliant lyrics!
……………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)